Badradrikothagudem

పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన

పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందు నియోజవర్గంలో విస్తృతంగా రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌ మరియు సమాచార పౌర సంబంధాలశాఖా మాత్యులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పర్యటించి పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసారు.ఇల్లెందు మండలంలోని ముకుందాపురం నుంచి కట్టుగూడెం వరకు రూ.5 కోట్ల వ్యయంతో నిర్మాణం చేయబోతున్న బీటీ రోడ్డు,మోడీ కుంట నుంచి రామచంద్రారావు పేట వరకు రూ. 50 లక్షలతో నిర్మాణం చేయబోతున్న బిటి రోడ్డుకు, ఇల్లందు పట్టణంలో రూ.1 కోటితో నిర్మాణం చేయబోతున్న స్విమ్మింగ్‌ పూల్‌కు, బుగ్గ బాబు రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణం, ఆడిటోరియం నిర్మాణం, ఫౌంటెన్ల నిర్మాణం, మోడల్‌ మార్కెట్‌ ప్రహరీ గోడ నిర్మాణం, ఆర్‌ అండ్‌ ఆర్‌ కాలనీలో రూ.1.30 కోట్ల వ్యయంతో పార్కుకు ఆయన శంకుస్థాపన చేశారు.
అనంతరం బొజ్జాయిగూడెంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఖమ్మం, మహబూబాబాద్, మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి జిల్లాలోని వివిధ శాఖలలో సాంక్షన్‌ అయి వివిధ దశలలో ఉన్న అభివృద్ధి పనులపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *