డిజిటల్ కార్డు సర్వేకు బృందాలను ఏర్పాటు చేయాలి
డిజిటల్ కార్డు సర్వేకు బృందాలను ఏర్పాటు చేయాలి
రాష్ట్ర ప్రభుత్వం పైలెట్ పద్ధతిన అమలు చేయనున్న కుటుంబానికి ఒక డిజిటల్ కార్డు సర్వేకై తక్షణమే బృందాలను ఏర్పాటు చేయాలని జిల్లా ప్రత్యేక అధికారి సురేంద్రమోహన్ అన్నారు. జిల్లా లో డిజిటల్ కార్డు సర్వే అమలుపై జిల్లా ప్రత్యేక అధికారి సురేంద్రమోహన్ హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ జితేష్,అదనపు కలెక్టర్లు డి వేణుగోపాల్, విద్యా చందన, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, ఆర్డీవోలు, తాసిల్దార్లు, ఎంపీడీవోలు,ఎంపీవోలతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో జిల్లా ప్రత్యేక అధికారి సురేంద్రమోహన్ మాట్లాడుతూ ప్రతి ఒక్క కుటుంబం వివరాలు డిజిటల్ కార్డు సర్వేలో తప్పకుండా నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. కుటుంబ సర్వేకు కావలసిన నోడల్ ఆఫీసర్లను మరియు బృందాలను తక్షణమే ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. సర్వే బృందాలుతమ పరిధిలోని కుటుంబాల సంఖ్య ఆధారంగా రోజుకు ఎన్ని కుటుంబాల సర్వే పూర్తి చేయాలో ప్రణాళిక రూపొందించుకోవాలని తెలిపారు. ఐదు రోజుల్లో కుటుంబ సర్వే పూర్తి చేయాలని అవసరమైతే అదనపు బృందాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అధికారులందరూ సర్వేలో భాగంగా ప్రతి కుటుంబ సభ్యుల వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని ఆదేశించారు.