ధాన్యం కొనుగోలుకు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు.
ధాన్యం కొనుగోలుకు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు.
ఖరీఫ్ 2024-25 సీజన్ లో జిల్లాలో సన్నరకం ధాన్యం కొనుగోలుకు ప్రత్యేకంగా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు.
భక్త రామదాసు కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు సన్నాహక సమావేశంలో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ, శిక్షణ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ తో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ, ఖరీఫ్ సీజన్ 2024-25 లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చివరి గింజ వరకు నాణ్యమైన వడ్లను మద్దతు ధరపై కొనుగోలు చేసి 48 గంటల్లో చెల్లింపులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని కలెక్టర్ తెలిపారు. ఖమ్మం జిల్లాలో అంచనా ప్రకారం 3 లక్షల మెట్రిక్ టన్నుల సన్న రకం ధాన్యం, లక్ష మెట్రిక్ టన్నుల దొడ్డు రకం ధాన్యం కొనుగోలు చేయబోతున్నామని అన్నారు.
సన్న రకం ధాన్యానికి ప్రభుత్వం 500 రూపాయల బోనస్ ప్రకటించిన నేపథ్యంలో కొనుగోలు కేంద్రాలకు అధికంగా వచ్చే అవకాశం ఉందనే అంచనాతో అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు. వ్యవసాయశాఖ విస్తరణ అధికారులు గ్రామాల వారీగా సన్న రకం ధాన్యం ధృవీకరణ చేసి కొనుగోలు కేంద్రాల మ్యాపింగ్ చేయాలని కలెక్టర్ తెలిపారు.