Khammam

ఐద్వా ఖమ్మం జిల్లా నూతన కమిటి

ఐద్వా ఖమ్మం జిల్లా నూతన కమిటి 

ఖమ్మం : అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా ఖమ్మం జిల్లా 12వ మహాసభ హవేలీలోని నాగార్జున ఫంక్షన్‌ హాల్‌లో జరిగింది. ఈ మహాసభలొ సంఘంజిల్లా అధ్యక్ష, కార్యదర్శులుగా మెరుగురమణ, బండి పద్మ ఎన్నికయ్యారు .వీరితో పాటు ఉపాధ్యక్షురాలుగా మాచర్ల భారతి, బుగ్గవీట్టి సరళ, షేక్‌ మెహరున్నీసాబేగం, సహాయ కార్యదర్శులుగా పయ్యావుల ప్రభావతి, పి.నాగసులోచన  ఆఫీస్‌ బేరర్స్‌గా శీలం కరుణ, జొన్నలగడ్డ సునీత, పెండ్యాల సుమతి, బెల్లం లక్ష్మి, గుడిమెట్ల రజిత, కత్తుల అమరావతి ఎన్నికైనారు.

ఈ మహాసభకు ముఖ్య అతిథిగా సంఘం రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి హాజరై కమిటీ ఎన్నిక చేశారు.అధ్యక్ష, కార్యదర్శులుగా ఎన్నికైన మెరుగు రమణ, బండి పద్మ  ఖమ్మం సుందరయ్య భవన్లో కమిటీ సభ్యులతో పాటు ఈ క్రింది తీర్మానాలను విడుదల చేశారు.

మహిళలపై పెరుగుతున్న అత్యాచారాలు, హింస, అరికట్టాలి. పసివయసు నుంచి పండు ముసలి వరకు మహిళల మీద ప్రతిరోజు అత్యాచారాలు జరుగుతున్నాయని వీటికి మూలం మద్యం, డ్రగ్స్‌,సెక్స్‌ సాహిత్యం,సినిమాలు,పబ్బులు వీటిని ప్రభుత్వం నిషేధించాలని మహిళలకు రక్షణ కల్పించాలని హింసకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ఈ తీర్మానంలో పేర్కొన్నారు. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్‌ వెంటనే అమలు చేయాలి.

దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటిన నేటికీ చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్‌ కల్పించలేదని మోడీ ప్రభుత్వం చట్టం చేశామని చెబుతున్న అమలుకు నోచుకోవడం లేదని వెంటనే మహిళా సాధికారతకు పార్లమెంటులో 33% రిజర్వేషన్‌ బిల్లును ఆమోదించింది. అమలు చేయాలని 12వ మహాసభ డిమాండ్‌ చేసింది.

సంఘం సీనియర్‌ నాయకురాలు ఏలూరు జయమ్మ సంఘం జెండాను ఆవిష్కరించారు. అనంతరం సంఘంలో పనిచేసి అమరులైన వారికి పూలమాలలు వేసి నివాళులర్పించి మహాసభను ప్రారంభించి కమిటీ ఎన్నిక వరకు దిగ్విజయంగా మహాసభను నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *