తెలంగాణ ఉద్యమకారుల కమిటీ చైర్మన్ డాక్టర్ కృష్ణారావు
తెలంగాణ ఉద్యమకారుల ఫోరం స్టేట్ స్టీరింగ్ కమిటీ చైర్మన్ గా డాక్టర్ కే.వి కృష్ణారావు .
ఖమ్మం : తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉమ్మడి ఖమ్మం జిల్లా చైర్మన్ గా డాక్టర్ కే.వి కృష్ణారావు గత ఆరు సంవత్సరాల నుండి తమ వంతు బాధ్యతలను నిర్వహిస్తూ గత సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం స్టేట్ స్టీరింగ్ కమిటీ చైర్మన్ బాధ్యతలు తీసుకుని కాంగ్రెస్ ప్రభుత్వం రావాలనే నినాదంతో తెలంగాణ ఉద్యమకారులను భాగస్వాములు చేసి ప్రభుత్వం ఏర్పాటు లో సమర్థవంతంగా పనిచేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటులో డాక్టర్ కే.వి కృష్ణారావు చేసిన కృషి నీ గ్రహించి రెండోసారి కూడా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం స్టేట్ స్టీరింగ్ కమిటీ చైర్మన్ పదవిని ఏకగ్రీవంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర చైర్మన్ చీమ శ్రీనివాస్ ప్రకటించారు. ఈ సందర్భంగా డాక్టర్ కే.వి కృష్ణారావు మాట్లాడుతూ.. ఉద్యమకారులందరును కలుపుకొని పోయి తెలంగాణ ఉద్యమకారుల హక్కుల కొరకై పోరాడి ఉద్యమని మరింత బలోపేతం చేయడానికి తమ వంతు కృషి చేస్తానన్నారు. తమపై నమ్మకంతో మరోసారి ఈ బాధ్యత అప్పజెప్పినందుకు రాష్ట్ర చైర్మన్ చీమ శ్రీనివాస్ కు మరియు రాష్ట్ర కమిటీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు .