నూతన సిసి రోడ్లను ప్రారంభించిన పాయం
నూతన సిసి రోడ్లను ప్రారంభించిన : ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
కరకగూడెం,శోధన న్యూస్ : కరకగూడెం మండలంలోని రేగళ్ల ,సమత్ బట్టుపల్లి, బట్టుపల్లి, కన్నాయిగూడెం గ్రామ పంచాయతీలలో నూతన సిసి రోడ్లను నిర్మించి ప్రారంభించారు. వీరాపురం , మద్దెలగూడెం ,గ్రామాలలో సిసి రోడ్లు శంకుస్థాపన కార్యక్రమాలు చేసిన ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వర్లు. ఈ సందర్భంగా ఆయన అన్ని శాఖల అధికారులతో ప్రజల సమస్యలపై సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి అక్కడి ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకొని వెంటనే అధికారులతో మాట్లాడి సమస్యలను నెరవేర్చే ప్రయత్నం చేశారు.ఈనెల చివరలోగా ఇందిరమ్మ ఇల్లు ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వే జరుగుతుందని. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలోకరకగూడెం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుసేన్ ,సమత్ బట్టుపల్లి, మాజీ సర్పంచులు పోలేబోయిన తిరుపతయ్య, శ్రీవాణి, బట్టుపల్లి మాజీ సర్పంచ్ తోలెం నాగేశ్వరరావు, మండల నాయకులు ఎర్ర సురేష్, గొగ్గలి రవి, జలగం కృష్ణ, వట్టం చుక్కయ్య, పూణేమ్ బుచ్చయ్య, పడిగా సమ్మయ్య, మోడెపు సాంబయ్య, కరకపల్లి నగేష్, బిజ్జా రామనాధం, బుడుగుల మధు తదితరులు పాల్గొన్నారు.