దీపావళి పండుగను ప్రజలు సంతోషంగా జరుపుకునేలా చర్యలు
దీపావళి పండుగను ప్రజలు సంతోషంగా జరుపుకునేలా చర్యలు చేపట్టాలి: అదనపు కలెక్టర్ వేణుగోపాల్ .
ప్రజలు సురక్షిత, ఆనందమయ దీపావళి జరుపుకునే లాగా అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్ అన్నారు. సోమవారం ఐ డి ఓ సి కార్యాలయం సమావేశ మందిరంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన తో కలిసి జిల్లా అధికారులతో దీపావళి టపాసుల షాపులు ఏర్పాట్లు, చేపట్టాల్సిన చర్యలు మరియు జాగ్రత్తలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఆయన కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 31న జరుపుకునే దీపావళి పండుగకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని అన్నారు. పోలీస్,మున్సిపల్, రెవెన్యూ మరియు పంచాయతీ తదితర శాఖలన్నీ సమన్వయంతో పనిచేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా అన్ని జాగ్రత్తలు చేపట్టాలన్నారు. కొత్తగూడెం ప్రకాశం మైదానంలో టపాసుల దుకాణాల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్నారు.
బాణాసంచా దుకాణాలు ఏర్పాటు కు అనుమతుల మంజూరు లో నిబంధనలు కచ్చితంగా పాటించాలన్నారు. అగ్నిపాపక శాఖ ఎన్ఓసి, మున్సిపల్ మరియు గ్రామపంచాయతీ ల అనుమతులు కచ్చితంగా ఉండాలన్నారు.ప్రభుత్వ అనుమతి లేకుండా ఏ ఒక్కరూ బాణాసంచా దుకాణాలు నిర్వహించకూడదన్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తే దుకాణాలను సీజ్ చేయాలన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్టాళ్లలోనే టపాసులు కొనుగోలు చేయాలన్నారు. ఎక్కడపడితే అక్కడ బహిరంగంగా బాణాసంచా దుకాణాలు నిర్వహిస్తే విక్రయదారుడుపై కేసులు నమోదు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. షాపులు పేలుడు రహిత అయి ఉండాలన్నారు. షాపుకు షాపుకు కనీసం మూడు మీటర్ల దూరం పాటించాలన్నారు. ఎదురెదురుగా షాపులు ఏర్పాటు ఉండరాదు అన్నారు. నిషేధిత టపాసులు అమ్మకుండా నిగా పెట్టాలన్నారు. నిబంధనల మేరకు షాపులు ఏర్పాటు చేస్తున్నారా లేదా అని రెవెన్యూ అధికారులు తనిఖీ చేయాలన్నారు. దుకాణాలు ఏర్పాటు చేసిన ప్రాంతాలలో వాహనాల పార్కింగ్ కు తగు చర్యలు చేపట్టాలన్నారు.
మైదానంలో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలన్నారు ముందస్తు జాగ్రత్తలలో భాగంగా ఇసుక,వాటర్ ట్యాంకులు, ఫైరింజన్లు అందుబాటులో ఉంచాలన్నారు. విద్యుత్ శాఖ వారు షాపులో నిర్వహిస్తున్న వారికి తాత్కాలిక మీటర్లు అందజేయాలని, ఏ విధంగా అతుకుల వైర్లు మరియు లూస్ కనెక్షన్స్ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. వైద్య శాఖ వారు హెల్త్ సూపర్వైజర్స్, ఏఎన్ఎంలతో వైద్య శిబిరం ఏర్పాటు చేసి, డ్రెస్సింగ్ కిట్స్ అందుబాటులో ఉంచాలని దీపావళి పండుగ రోజు స్పెషలిస్ట్ డాక్టర్లు ప్రభుత్వ ఆసుపత్రిలో 24 గంటలు అందుబాటులో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో జడ్పీ సీఈవో చంద్రశేఖర్,కొత్తగూడెం, భద్రాచలం ఆర్డీవోలు మధు, దామోదర్, , కొత్తగూడెం డిఎస్పి రెహమాన్, అగ్నిమాపక శాఖ అధికారి క్రాంతి కుమార్ , మరియు అన్ని శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.