Telangana

అభివృద్ధిని ఓర్వలేక పొన్నం ప్రభాకర్ పై విమర్శలు

అభివృద్ధిని ఓర్వలేక పొన్నం ప్రభాకర్ పై విమర్శలు

–కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఇంద్రసేనారెడ్డి

హుస్నాబాద్ ఎల్కతుర్తి: హుస్నాబాద్ నియోజకవర్గం ఎల్కతుర్తి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ.. హుస్నాబాద్ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ గౌడ్ కరీంనగర్ ఎమ్మెల్యే నా లేక హుస్నాబాద్ ఎమ్మెల్యే అనడం 9 నెలల కాలం వ్యవధిలో పొన్నం ప్రభాకర్ గౌడ్ పై ఓడిపోయిన భ్రమలో మాట్లాడడం తన అసమర్ధకు నిదర్శనమని అన్నారు.

హుస్నాబాద్ నియోజకవర్గం చేస్తున్నటువంటి అభివృద్ధి పనులను తెస్తున్నటువంటి నిధులను జీర్ణించుకోలేక ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించబోమని రెండుసార్లు హుస్నాబాద్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించి ఎటువంటి నిధులు తీసుకురాకుండా కెసిఆర్ కుటుంబానికి సన్నిహితము అంటూ వొడితల కుటుంబం పబ్బం గడుపుకొని రెండుసార్లు ఎమ్మెల్యే గెలిచి ఎటువంటి అభివృద్ధి చేయకుండా మరోసారి తెలంగాణ సెంటిమెంట్ ను వాడుకొని గెలుస్తామనుకున్నా హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పారు అన్నారు.

హుస్నాబాద్ అంటే పొన్నం పొన్నం అంటే హుస్నాబాద్ అనే రీతిలో హుస్నాబాద్ ప్రజలకు మాట ఇచ్చిన ప్రకారము 9 సంవత్సరాల కాలం పాటు అభివృద్ధికి నిధులు తేకుండా ఎటువంటి బ్రిడ్జిలు శాంక్షన్ చేయకుండా గాలికి వదిలేసినటువంటి మీరు ఏదైతే మీరు ప్రశ్నిస్తున్నరో ప్రతి ఒక్క బ్రిడ్జిలు మరియు సిసి రోడ్ల నిర్మాణాలకు నిధులు కేటాయించడం జరిగిందన్నారు. ఈ వాస్తవాలు ప్రజలకు తెలియ వద్దనయే ఉద్దేశంతో ఏదో ఒక సాకుతో మంత్రి హోదాలో అభివృద్దయే లక్ష్యంగా ముందుకు పోతున్నటువంటి పొన్నం ప్రభాకర్ గౌడ్ ను విమర్శించే అర్హత మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ కు లేదని హెచ్చరించారు. హుస్నాబాద్ అభివృద్ధి అంటే ఏంటో మరి కొద్ది రోజుల్లో ఎల్కతుర్తి ముఖచిత్రం ముఖ ద్వారంతో చూపించబోతున్నామని అన్నారు.  ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *