దీపావళి సందర్భంగా స్వీట్స్ పంపిణీ
ఎస్ &పి సి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ కు దీపావళి సందర్భంగా స్వీట్స్ పంపిణీ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ,పినపాక నియోజకవర్గం ,మణుగూరు ఏరియా సింగరేణి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ కు మురళి మాన్ పవర్ ఏజెన్సీ వారు ప్రతి ఒక్కరికి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అన్ని కుటుంబాలు దీపావళి పండుగను ఘనంగా జరుపుకోవాలని సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ మురళీ మాన్ పవర్ ఏజెన్సీ వారు దీపావళి సందర్భాన్ని పురస్కరించుకొని ఈసందర్భంగా. ఎస్ & పి సి. ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ కు స్వీట్స్ జిఎం ఆఫీస్ వద్ద పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు సీనియర్ , జూనియర్ గాడ్స్ మాట్లాడుతూ.. మురళి మాన్ పవర్ ఏజెన్సీ వారు ఈ దీపావళికి స్వీట్స్ ప్రతి ఒక్క గార్డ్ కు అందజేసినందుకు చాలా సంతోషంగా ఉందని , ప్రతి ఒక్క విషయంలో కాంట్రాక్టర్ మాకు సహాయ సహకారాలు అందిస్తున్నందుకు, కాంట్రాక్టర్ కుటుంబానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. వారికి వారి కుటుంబానికి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ స్వీట్స్ సూపర్వైజర్ల చేతుల మీదుగా ప్రతి ఒక్క గార్డుకు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్స్ డి సుధాకర్, రామ్ అవతార్ ,ఎస్ కె. రబ్బాని, మరియు సీనియర్ , జూనియర్ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ తదితరులు పాల్గొన్నారు.