తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

నవంబర్ నెల ఆఖరుకల్లా అందరికి మంచినీటి సరఫరా చేయాలి

నవంబర్ నెల ఆఖరుకల్లా అందరికి మంచినీటి సరఫరా చేయాలి
జిల్లా కలెక్టర్ ప్రియాంక
భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్:
పాల్వంచ పట్టణంలో ప్రజలందరికీ నవంబర్ నెల ఆఖరుకల్లా మంచినీరు సరఫరా చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల అధికారులకు సూచించారు.  భద్రాద్రి కొత్తగూడెం ఐ డి ఓ సి మినీ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాక అల పబ్లిక్ హెల్త్, మున్సిపల్ కమిషనర్, మిషన్ భగీరథ అధికారులతో మంచినీటి సమస్యపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ పనుల పురోగతిపై ఆరా తీశారు. పాల్వంచ పట్టణ మున్సిపాలిటీ పరిధిలోని మిషన్ భగీరథ అర్బన్ పనులను సమీక్షించారు. పైపులైన్, ట్యాంకులు త్వరగా  పూర్తి చేయాలని సోమవారం సూచించారు. నవంబర్ నెల ఆఖరుకల్లా పూర్తిస్థాయిలో మంచినీటి సరఫరా జరగాలని పబ్లిక్ హెల్త్ మరియు మున్సిపల్ అధికారులను ఆదేశించారు.టాపింగ్ పాయింట్ ల ద్వారా పూర్తిస్థాయిలో నీటి సరఫరా చేయాలని మిషన్ భగీరథ  రూరల్ అధికారులను ఆదేశించారు.ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ఏ స్వామి, మిషన్ భగీరథ గ్రిడ్ ఇఇ నలిని, ఇంట్రా ఈ ఈ తిరుమలేష్,  మున్సిపల్ డిఇ మురళి, పబ్లిక్ హెల్త్  డి ఇ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *