Telangana

భక్తిశ్రద్ధలతో శివాలయంలో కార్తీక పౌర్ణమి దీపోత్సవం

భక్తిశ్రద్ధలతో శివాలయంలో కార్తీక పౌర్ణమి దీపోత్సవం

హనుమకొండ: ఎల్కతుర్తి మండల కేంద్రంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి శివాలయ దేవాలయంలో శుక్రవారం రోజున కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు దీపారాధన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. శ్రీ రాజరాజేశ్వర స్వామి నిర్మాణం జరిగి గత కొన్ని సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ గత 15 సంవత్సరాల క్రితం నుండి కార్తీక మాసం లో కార్తీక పౌర్ణమి సందర్భంగా కార్తీక దీపారాధన ఆకాశ దీపారాధన జ్వాలా తోరణ దీపారాధన కార్యక్రమం ఎల్కతుర్తి శివాలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కన్నుల పండుగగా నిర్వహిస్తున్నారు.అదేవిధంగా దీపారాధన చేయడం జరిగింది.

ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మణిశర్మ మాట్లాడుతూ.. శుక్రవారం రోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉదయం ఐదు గంటల నుండి భక్తులు స్వామివారిని దర్శించుకుని వారి ముక్కులను సమర్పించుకున్నారని తెలియజేశారు . మధ్యాహ్నం సమయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం పూజ కార్యక్రమాలు నిర్వహించామని ఈ కార్యక్రమంలో దంపతులు జంటగా పాల్గొని సత్యనారాయణ వ్రతం పూజ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. సాయంకాలం సమయంలో కార్తీక పౌర్ణమి శివలింగం ఆకారంలో దీపాలు వెలిగించి ఆకాశ దీపారాధన జ్వాలాముఖి దీపారాధన చేయడం జరిగిందనన్నారు.

తెల్లవారుజాము నుండి భక్తులతో ఉసిరి దీపాలను వెలిగించి తమ భక్తిని చాటుకున్నారు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎల్కతుర్తి గ్రామ ప్రజలు శివాలయ కమిటీ సభ్యులు మహిళలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరిగిందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *