రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి
రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, తో కలిసి న్యూఢిల్లీ నుండి రాష్ట్రంలోని మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జిల్లా కలెక్టర్లు, సంబంధిత అధికారులతో ధాన్యం కొనుగోళ్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని, కేంద్రాలలో గన్ని సంచులు, ప్యాడి క్లీనర్స్, అందుబాటులో ఉంచుకోవాలని, కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను ఆన్లైన్లో నమోదు చేసి రైతులకు వెంటవెంటనే డబ్బులు పడే విధంగా సంబంధిత జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలన్నారు. సన్న రకం కు బోనస్ డబ్బులు వెంటనే మంజూరు చేయాలన్నారు.
మహబూబ్ నగర్ రైతు సదస్సు లోపు రైతులందరికీ వారి వారి ఖాతాలలో ధాన్యం కొనుగోలు డబ్బులు పడేలా ఆర్థిక శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణపై రైతులకు అందిస్తున్న సౌకర్యాల గురించి ప్రజలకు చేరే విధంగా విస్తృత ప్రచారం చేయాలన్నారు.