బిసి కార్పొరేషన్ సబ్సిడీ రుణాలు అందించాలి
బిసి కార్పొరేషన్ సబ్సిడీ రుణాలు అందించాలి
తెలంగాణ బిసి బహుజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బిసి కుల సంఘాలు హన్మకొండ జిల్లా బిసి కార్పొరేషన్ డీడీ రాంరెడ్డి కి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్బంగా రాష్ట్ర అధ్యక్షులు ప్రతాపగిరి విజయకుమార్ మాట్లాడుతూ భారత దేశానికి స్వాతంత్ర వచ్చిన నాటి నుండి నేటి వరకు విద్య, ఉద్యోగం, ఉపాధి, ఆర్థిక, రాజకీయ, అనేక రంగాలలో వెనుకబడి ఉన్న బిసి, ఎంబీసీ, సంచార జాతులలో ఉన్నటువంటి కులాలను గత ప్రభుత్వాలు ఈ యొక్క వర్గాల అభివృద్ధి కొరకు ఒక ప్రణాళిక బద్దంగా కృషి చేయలేక పోయాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలో లక్షల మంది విద్యార్థులు ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు రాక ఉపాదులు దొరకక దిక్కుతోచని పరిస్థితులు ఉండేవని దాదాపు కొన్ని సంవత్సరాలు గత ప్రభుత్వాల దృష్టికి బిసి లు తమ సమస్యలు వినతి పత్రాల ద్వారా ఇవ్వడం జరిగినదన్నారు.
ప్రభుత్వాలు ఏ ఒక్క సమస్యను పరిష్కరించలేదని బిసి సంఘాలు బిసి కుల సంఘాలు పలు నిరసన కార్యక్రమాలు చేయటంతో ప్రభుత్వాలు దిగి వచ్చి బిసి కులాల యువతి, యువకుల జీవనోపాధి కొరకు రాష్టంలో బిసి కార్పొరేషన్ లు ఏర్పాటు చేసి వాటి ద్వారా సబ్సిడీ రుణాలు ఐదు వేల నుండి లక్ష రూపాయల వరకు బిసి బందు పేరుతో కుల వృత్తి పై ఆధారపడి జీవిస్తున్న బిసి నిరుద్యోగ యువతి, యువకులకు ఇవ్వడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత 2024—2025 బడ్జెట్ లో బీసీలకు ఎనిమిది వేలకోట్లు కేయించడం జరిగినదన్నారు. ఇప్పటి వరకు ఈ సంవత్సరం వ్యక్తిగత రుణాలు అందించటానికి అర్హులైన బిసి కులాలకు సబ్సిడీ రుణాలు పొందుటకు ఆన్ లైన్ ధ్వారా దరఖాస్తు చేసుకోవడానికి గైడ్ లైన్స్ వెంటనే ఇవ్వాలని అలాగే అర్హులైన రుణ లబ్దిదారులకు ఇవ్వాలని తెలంగాణ బిసి బహుజన సంక్షేమ సంఘం విజ్ఞప్తి చేశారు.