Telangana

పురాతన వీరభద్ర స్వామి దేవాలయాన్ని సందర్శించిన 

పురాతన వీరభద్ర స్వామి దేవాలయాన్ని సందర్శించిన 

బూర్గంపాడు మండలం మోతే గ్రామంలో గోదావరి నడిపోడ్డున ఉన్నటువంటి పురాతన వీరభద్ర స్వామి దేవాలయాన్ని సందర్శించి ఆలయం యొక్క చరిత్రను, ప్రత్యేకతల గురించి అడిగి తెలుసుకుని, అశ్వరావుపేట పూసుకుంట మధ్యలోని తిరుమలకుంట వెళ్లే దారిలో అడవి ప్రాంతంలోని రోడ్డుకు ఇరువైపులా ఉన్న గుట్టలు మరియు అడవి అందాలను డ్రోన్ కెమెరాల ద్వారా చితకరించడం జరిగిందని రైన్ వాటర్ టీం మరియు స్టూడియో పంచతంత్ర బృందాలు పర్యటిస్తున్నట్లు రైన్ వాటర్ ప్రాజెక్ట్ ఫౌండర్ సీఈవో కల్పనా రమేష్ అన్నారు.

జిల్లాలోనీ ఆదివాసి గిరిజనుల చరిత్ర మరియు సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు, అభివృద్ధి పరచడానికి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచన మేరకు జిల్లాలో పర్యటన సాగిస్తున్నామన్నారు. పర్యటన అనంతరం జిల్లా యొక్క ప్రాముఖ్యత ప్రపంచవ్యాప్తంగా తెలిసే విధంగా మరియు ఈ ప్రాంతాల యొక్క గిరిజన సంస్కృతి అంతరించిపోకుండా జిల్లా కలెక్టర్ చొరవతో విస్తృతంగా అభివృద్ధి చేసి ప్రపంచానికి తెలియజేయడానికి డాక్యుమెంటరీ రూపొందించడం జరుగుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో మణుగూరు తాసిల్దార్ రాఘవరెడ్డి, ఎంపీడీవో శ్రీనివాసరావు, ఎంపీ ఓ వెంకటేశ్వరరావు, బూర్గంపాడు ఎంపీడీవో సునీల్ శర్మ, ఎంపీడీవో జమలారెడ్డి మరియు బృందం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *