తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్ తో సైబర్ నేరాల నియంత్రణ

ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్ తో సైబర్ నేరాల నియంత్రణ

-భద్రాద్రి కొత్తగూడెం జిల్లా  ఎస్పీ రోహిత్ రాజు

భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ ౩-శోధన న్యూస్ : ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్ తో సైబర్ నేరాల నియంత్రించవచ్చని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా  ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు,ఇతర పోలీస్ అధికారుల సమక్షంలో సైబర్ నేరాల నివారణ కొరకు రూపొందించిన  ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్ పోస్టర్లను జిల్లా ఎస్పీ విడుదల చేశారు.  అనంతరం జిల్లా ఎస్పి రోహిత్ రాజు మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా ప్రజల్లో సైబర్ నేరాల నివారణపై అవగాహన పెంచేందుకు,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు,జిల్లా పోలీస్ అధికారుల ఆధ్వర్యంలో ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్ పేరుతో 42 రోజులపాటు ప్రత్యేక అవగాహనా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు  తెలిపారు. ఆరు  వారాల పాటు జిల్లా వ్యాప్తంగా నిర్వహించే సైబర్ నేరాల నివారణ అవగాహన కార్యక్రమాల్లో జిల్లాలోని పోలీస్ స్టేషన్ల అధికారులు,సీఐలు,డీఎస్పీలు “ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్” పేరుతో సైబర్ నేరాల నివారణకు ప్రజల్లో అవగాహన కల్పిస్తారని ఈ సందర్బంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో సైబర్ సెక్యూరిటీ బ్యూరో డిఎస్పీ అశోక్,సిఐ జితేందర్,స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్స్ సీహెచ్.శ్రీనివాస్,ఇ.శ్రీనివాస్,ఐటి సెల్ ఇన్స్పెక్టర్ రాము,వెల్ఫేర్ ఆర్ఐ కృష్ణారావు,ఎస్సైలు రాజమౌళి,శ్రీను లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *