ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
మణుగూరు, శోధన న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం మణుగూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థినిలు, అధ్యాపకులు ఎంతో నిష్టగా భక్తిశ్రద్ధలతో బతుకమ్మలను పేర్చి బతుకమ్మ ఆటపాటలతో సంబరాలు జరుపుకున్నారు.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ సయ్యద్ యూసఫ్ మాట్లాడుతూ… తెలంగాణ సంస్కృతికి సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ అని, తెలంగాణా ఆడపడుచులందరూ సంబరంగా జరుపుకునే ఈ వేడుక బతుకమ్మ పండుగ అని అన్నారు. ప్రకృతిని ఆరాధిస్తూ…అనుబంధాలను గుర్తుచేస్తూ సాగే పూల ఉత్సవంగా సాగే తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని చాటి చెప్పే కమనీయ దృశ్యం బతుకమ్మ పండుగను తమ కళాశాలలో అధ్యాపకులతో పాటు విద్యార్థినీలు పండగ జరుపుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ వేడుకల్లో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీనివాస్, అధ్యాపకులు పద్మావతి, నజీన్ కౌసర్, కృష్ణ, బాబురావు ,కిరణ్ తదితరులు పాల్గొన్నారు.