రెండవ విడత పంచాయతీ ఎన్నికలకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు
రెండవ విడత పంచాయతీ ఎన్నికలకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు
-ప్రజలందరూ నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి
-భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెండవ విడతలో జరగబోయే పంచాయితీ ఎన్నికలకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను చేసినట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. మొత్తం 766 పోలింగ్ స్థానాలలోని పోలింగ్ కేంద్రాలలో పోలీస్ శాఖ తరపున పూర్తిస్థాయి బందోబస్తును ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు.సుమారుగా 1500 మంది పోలీసులతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా చర్యలను చేపట్టడం జరుగుతుందని అన్నారు.1392 పోలింగ్ కేంద్రాలలో సాధారణ పోలింగ్ కేంద్రాలు-878, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు-179,అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు-285,క్మావోయిస్టు ప్రభావిత పోలింగ్ కేంద్రాలు-50 లను గుర్తించినట్లు తెలిపారు.ప్రజలందరూ నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.రాష్ట్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు పోలీస్ అధికారులు,సిబ్బంది ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని ఆదేశాలు జారీ చేశారు.ఓటర్లను ప్రలోభ పెట్టే విధంగా ఎవరైనా నగదు,మద్యం వంటి వాటితో పట్టుబడితే చట్టపరంగా కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు.


