తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

యువతకు జాబ్ గ్యారెంటీతో ఉచిత స్కిల్ ట్రైనింగ్

యువతకు జాబ్ గ్యారెంటీతో ఉచిత స్కిల్ ట్రైనింగ్

-భద్రాద్రి కొత్తగూడెం  జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్

భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 25-శోధన న్యూస్ : 
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని నిరుద్యోగ యువతి, యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో లాజిస్టిక్స్ స్కిల్ కౌన్సిల్(LSC), రెడింగ్టన్ ఫౌండేషన్(COLTE) సహకారంతో జాబ్ గ్యారెంటీతో కూడిన ఉచిత స్కిల్ ట్రైనింగ్ కార్యక్రమం అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా లాజిస్టిక్స్ రంగానికి చెందిన వివిధ విభాగాల్లో నైపుణ్య శిక్షణ అందించి, శిక్షణ పూర్తైన అనంతరం 100 శాతం ప్లేస్‌మెంట్‌తో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ నెల 24న జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ఎంపిక డ్రైవ్‌లో 29 మంది అభ్యర్థులను ఎంపిక చేయగా, మొత్తం 51 మంది యువతి, యువకులు శిక్షణకు హాజరయ్యారని తెలిపారు. మరింత మందికి అవకాశం కల్పించేందుకు ఈ నెల  27 న ఉదయం 10.30 గంటలకు జిల్లా కలెక్టర్ కార్యాలయం లో మరో ప్రత్యేక ఎంపిక డ్రైవ్ నిర్వహించి అదనంగా 50 మంది యువతను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఈ శిక్షణలో వేర్‌హౌస్ స్టోర్ కీపర్, సప్లై చైన్ అసోసియేట్, ఎక్స్‌పోర్ట్–ఇంపోర్ట్ ఎగ్జిక్యూటివ్ వంటి కోర్సులు ఉండగా, 10వ తరగతి నుంచి గ్రాడ్యుయేషన్ అర్హత కలిగి 18 నుంచి 27 సంవత్సరాల వయస్సు ఉన్న యువతి, యువకులు అర్హులని తెలిపారు. శిక్షణ అనంతరం నెలకు రూ13,000 నుంచి రూ18,000 వరకు జీతంతో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఈ శిక్షణ పూర్తిగా ఉచితమై స్కిల్ ఇండియా సర్టిఫికేషన్ కలిగి ఉండటంతో పాటు భోజనం, వసతి సౌకర్యాలు కూడా ఉంటాయని, జిల్లాలోని నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *