తెలంగాణభద్రాద్రి కొత్తగూడెంమణుగూరు

బాలవెలుగు పాఠశాలలో అన్నదానం

అయ్యప్ప స్వామికి ఉత్తరా నక్షత్ర పూజలు

– బాలవెలుగు  పాఠశాలలో అన్నదాన కార్యక్రమం

మణుగూరు, శోధన న్యూస్ :  శ్రీ హరి హర పుత్రుడు, ఆనంద చిత్తుడు   శ్రీ అయ్యప్ప స్వామి వారి జన్మ నక్షత్రమైన ఉత్తరా నక్షత్రం సందర్భంగా మణుగూరు మండలం సి టైపు కాలనీలోని బాలవెలుగు పాఠశాలలో విద్యార్దులకు, ఆనాద  వృద్దులకు శనివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మణుగూరు శివాలయం పీఠం గురుస్వామి యాకయ్య గురుస్వామి పర్యవేక్షణలో మణుగూరు అయ్యప్ప స్వామి పీఠం పీఠాధిపతులు, గురుస్వాములు ఆధ్వర్యంలో బోబర్ల సురేష్ కుమార్ స్వామి (శ్రీ పంచముఖ వేద గాయత్రి అయ్యప్ప స్వామి పీఠం)  సహకారంతో  నిర్వహించారు. ఈ సందర్భంగా గురుస్వాములు మాట్లాడుతూ.. అయ్యప్ప స్వామి ఉత్తరా నక్షత్రం రోజున అన్నదానం చేయడం ఎంతో పుణ్యప్రదమని, సమాజంలోని అనాధలు, వృద్ధులకు సేవ చేయడమే నిజమైన భక్తి అని పేర్కొన్నారు.   ముందుగా శ్రీ అయ్యప్ప స్వామి వారికి  వెంకటేశ్వర సిద్ధాంతి ఉత్తరా నక్షత్ర పూజలను   భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ  కార్యక్రమంలో  పాఠశాల నిర్వాహకులు జగన్మోహన్ రెడ్డి,  తనుగుల శ్రీను గురుస్వామి, దశరథం గురుస్వామి, రామదాసు గురుస్వామి, ఇటికాల వెంకటేశ్వర్లు గురుస్వామి, సాయి గురుస్వామి, చంటి గురుస్వామి, కరకగూడెం మండలం మోతే గ్రామానికి చెందిన సోమిరెడ్డి గురుస్వామి, రామానుజవరం శివాలయం ఆలయ ట్రస్ట్ సభ్యులు సిహెచ్ చంద్రశేఖర్, శివారాధకుడు కట్ల నరేష్, హరి  పీఠం సభ్యులు,  అయ్యప్ప స్వామి సేవకులు నాగవీరన్న, కోట వెంకన్న, ఉపాధ్యాయులు, సిబ్బంది   పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *