ఘనంగా యాదవ సంఘం ఆత్మీయ సమ్మేళనం
ఘనంగా యాదవ సంఘం ఆత్మీయ సమ్మేళనం
–సమ్మేళనంలో పాల్గొన్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
హైదరాబాద్, శోధన న్యూస్: నాగోల్ లో యాదవ్ సంఘం ఆత్మీయ సమ్మేళనం బుధవారం ఘనంగా జరిగింది. ఈ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి యాదవ్ హాజరై మాట్లాడారు. పాడి పరిశ్రమల్లో భాగంగా అర్హులకు పశువులు అందేలా చూస్తామన్నారు. పశువుల కోసం ఆసుపత్రి కూడా ఏర్పాటు చేస్తానన్నారు. ప్రభుత్వం నుండి వచ్చే ప్రతి పథకాలు అందరికి అందేలా చూస్తానని హామీ ఇచ్చారు.
యాదవ సంఘం సభ్యులకు తాను అన్ని విధాలుగా అండగా ఉంటానన్నారు. తాము కూడా ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా నన్ను దీవించి కారు గుర్తుకు ఓట్ వేసి బిఅర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మరొక్కసారి అవకాశం కల్పించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం,కర్మన్ ఘాట్ హనుమాన్ దేవాలయం మాజీ చైర్మన్ ఈశ్వరమ్మ యాదవ్,బ్కుంట్లురు వెంకటేష్ గౌడ్, సుర్వి రాజు గౌడ్, యాదవ సంఘం ప్రతినిధులు సతీష్ యాదవ్, కిరణ్ యాదవ్,కిషన్ యాదవ్, వెంకటేష్, భాస్కర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.