తెలంగాణ ఆత్మగౌరవానికి,సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ
తెలంగాణ ఆత్మగౌరవానికి,సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ
-బతుకమ్మ సంబరాల్లో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
హైదరాబాద్/మణుగూరు: తెలంగాణ ఆత్మగౌరవానికి, సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. హైదరాబాద్ లోని వెంకటాద్రి టౌన్ షిప్ లో స్థానిక బిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన తెలంగాణ బతుకమ్మ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళలతో కలిసి బతుకమ్మల పాటలకు నృత్యాలు చేశారు. అనంతరం విప్ రేగాను శాలువాలతో ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా జరుపుకుంటూ తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలను రాష్ట్ర గౌరవిస్తుందన్నారు. మహిళలు అన్ని రంగాలలో రాణించి ముందుండాలని అన్నారు.