ఆర్టీసీ కార్మికులు పై వేధింపులు ఆపాలని నిరసన
ఆర్టీసీ కార్మికులు పై వేధింపులు ఆపాలని నిరసన
మణుగూరు, శోధన న్యూస్: ఆర్టీసి కార్మికులను వేదింపులకు గురిచేయడం ఆపాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర జేఏసీ పిలుపుమేరకు గురువారం మణుగూరు ఆర్టీసి డిపో కార్మికులు నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరై నిరసన వ్యక్తం చె శారు. ఈ సందర్భంగా ఎస్ఓబ్ల్యూఎఫ్ డిపో అధ్యక్షులు టి సుధాకర్ మాట్లాడుతూ… బండ్లగూడ డిపో కండక్టర్ శ్రీవిద్య అధికారుల వేధింపుల వలన ఆత్మహత్యకు పాల్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోలలో అధికారులు కార్మికులను వేదింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. అక్రమంగా బదిలీలు, సస్పెన్షన్లకు పాల్పడుతున్నారన్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ యాజమాన్యం స్పందించి కార్మికులపై అధికారుల వేదింపులకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ డబ్ల్యూఎఫ్ డిపో కార్యదర్శి కెవి రామారావు, ఎస్కె సలీం, రమేష్, ఎస్కె పాషా, ఆర్ఎన్ రావు, శ్రావణి, టీఎంయు నాయకులు ఏ నారాయణ, కార్మికులు పాల్గొన్నారు.