మేబిలైన్ న్యూయార్క్ ఆధ్వర్యంలో బ్రేవ్ టాక్
మేబిలైన్ న్యూయార్క్ ఆధ్వర్యంలో బ్రేవ్ టాక్
హైదరాబాద్, శోధన న్యూస్: ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం పురస్కరించుకొని మేబిలైన్ న్యూయార్క్ ఆధ్వర్యంలో బ్రేవ్ టాక్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రొఫెషనల్ మేకప్ మేనేజర్ జీనియ బస్తాని మాట్లాడుతూ మానసిక ఆరోగ్యం పెంచేందుకు తామేంతో కృషి చేస్తున్నాం అన్నారు. అందుకోసం ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. బ్రేవ్ టాక్ ద్వారా ప్రోత్సాహాన్ని ఇచ్చేలా వక్తలతో సందేశాలు ఇప్పిస్తున్నం అన్నారు. అనంతరం కార్యక్రమానికి హాజరైన అనన్య బిర్లా మాట్లాడుతూ మానసిక క్షేమం అనేది ఎంతో అవసరమని పేర్కొన్నారు. మానసిక సమస్యలపై దృష్టి సారించి పరిష్కరించేందుకు బ్రేవ్ టాక్ దోహద పడుతుందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో అన్షులా కపూర్,కుషాకపిల, నిఖిల్ తనేజా, ప్రముఖ ఆరోగ్య నిపుణులు పాల్గొన్నారు.