ఖమ్మంతెలంగాణ

అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన మాజీ మంత్రి తుమ్మల

అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన మాజీ మంత్రి తుమ్మల

ఖమ్మం, శోధన న్యూస్: శ్రీ వాసవి మహిళా ఉత్సవ కమిటీ డాబాల బజార్ వారి ఆధ్వర్యంలో శ్రీ దేవి నవరాత్రుల ఆరో వార్షికోత్సవం సందర్భంగా ఐదవ రోజు కార్యక్రమంలో భాగంగా గురువారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు . ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు హాజరై ప్రారంభించారు . శాఖంబారి అవతారంతో ఉన్న అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు . అనంతరం కమిటీ సభ్యులు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ను శాలువాతో ఘనంగా సన్మానించి సత్కరించారు . సుమారుగా రెండు వేల మంది భక్తులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు . ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, కార్పొరేటర్లు కమర్తపు మురళి , కొప్పెర ఉపేందర్ సరిత, మాజీ కార్పొరేటర్ బాలగంగాధర్ తిలక్ , కమిటీ సభ్యులు గీత, అనిత, హైమ, లక్ష్మి, అంజలి, సుధా , వసంత , లావణ్య , శారద , సునీత , స్వాతి , చంద్రకుమార్, నారాయణరావు, లక్ష్మీ నరసింహారావు , మహేష్, మోహనచారి, రమేష్, అప్పారావు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *