ఈవీఎం, వీవీ ప్యాడ్ లపై అవగాహన ఉండాలి.
ఈవీఎం, వీవీ ప్యాడ్ లపై అవగాహన ఉండాలి.
వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య.
వరంగల్ ,శోధన న్యూస్:ఈవీఎం, వీవీ ప్యాడ్ లపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని వరంగల్ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అన్నారు.
అసిస్టెంట్ మాస్టర్ ట్రైనర్స్ కు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని.. జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు.
గురువారం జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో ఈవీఎం, వివి ప్యాడ్ లపై 18 మంది అసిస్టెంట్ మాస్టర్ ట్రైనర్స్ కు ఏర్పాటు చేసిన శిక్షణ, అవగాహన కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిధిగా హాజరైయ్యారురు.ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ …శిక్షణ పొందిన శిక్షకులు నియోజకవర్గాల వారీగా ప్రతి సెషన్ కు 150 మందికి మించకుండా ప్రిసైడింగ్ ఆఫీసర్లకు పూర్తి అవగాహన కల్పించాలన్నారు.