తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

ద్విచక్ర వాహనాల దొంగ అరెస్ట్

ద్విచక్ర వాహనాల దొంగ అరెస్ట్
మణుగూరు, శోధన న్యూస్ : ద్విచక్ర వాహనాలను దొంగిలిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు మణుగూరు సిఐ రమాకాంత్ తెలిపారు. ఇందుకు సంబంధించి సిఐ విలేకరులకు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని హనుమాన్ టెంపుల్ వద్ద మణుగూరు డిఎస్పి రాఘవేంద్రరావు అదేశాల మేరకు సిఐ రమకాంత్, ఎస్సై రాజేష్, శ్రీనివాస్ లు పోలీస్ సిబ్బంది తో కలిసి శుక్రవారం వాహన తనీఖీ నిర్వహించారు. ఈ తనిఖీలో పలు వాహనాల‌ ధృవీకరణ పత్రాలను పరిశీలించారు. అశోక్ నగర్ కు చెందిన,ఎస్ కె అక్బర్ అనే వ్యక్తి తన ద్విచక్ర వాహనం పై వస్తుండగా…ద్వి చక్ర వాహనం కు సంబంధించిన ధృవీకరణ పత్రాలను అడుగగా పొంతన లేని సమాధానం చెప్పడంతో అ వ్యక్తి పై అనుమానం వచ్చిన పోలీసులు అదుపులోకి తీసుకోని విచారించారు.కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నానని, కూలీ పనితో వచ్చే డబ్బులు సరిపోక,ద్వి చక్ర వాహనాలను అపరించి ఒక్క దగ్గర పెట్టి అమ్ముతున్నట్లు పోలీసుల విచారణ లో వివరాలు తెలిపాడు. గతంలో సైతం సదరు వ్యక్తి ద్విచక్ర వాహనాలను అపహరించిన కేసులో జైలుకు వెళ్ళివచ్చాడు.అతని వద్ద నుండి నాలుగు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకోని కేసు నమోదు చేసినట్లు ‌సిఐ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *