పోలీస్ అమరవీరులు ఆశయాలను కొనసాగిద్దాం
పోలీస్ అమరవీరులు ఆశయాలను కొనసాగిద్దాం
– జిల్లా ఎస్పీ గౌస్ ఆలం
ములుగు,శోధన న్యూస్: పోలీస్ అమరవీరులు చేసిన త్యాగాలు మరువలేమని ప్రతి ఒక్కరు వారి ఆశయాలను కొనసాగించాలని జిల్లా ఎస్పీ గౌస్ ఆలం అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం పురస్కరించుకొని ములుగు జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో జిల్లా ఎస్పీ శ్రీ గౌష్ ఆలం అమరవీరుల కుటుంబాలను ముఖ్య అతిథులుగా ఆహ్వానించి ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరిపించారు. ముందుగా అమరవీరుల స్థూపానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ విధి నిర్వహణలో ప్రాణాలను అర్పించిన పోలీసుల జీవితాలను ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకొని నడుచుకోవాలని సూచించారు. పోలీసు జీవితం ముళ్ళపై నడక వంటిదని అవిశ్రాంతంగా ప్రజల ధన మాన ప్రాణాల కోసం నిరంతరం పనిచేయాల్సి ఉంటుందని అన్నారు. మృతి చెందిన వారి కుటుంబాలకు అందవలసిన సహాయాలను తక్షణమే అన్న విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఓ ఎస్ డి అశోక్ కుమార్, ఏటూరునాగారం ఏ ఎస్ పి సిరిశెట్టి సంకీర్త్, అదనపు ఎస్ పి సదానందం,డి ఎస్ పి రవీందర్,ఎస్ బి ఇన్స్పెక్టర్ కిరణ్ సి సి ఎస్ ఇన్స్పెక్టర్ దయాకర్,సి ఐ ములుగు రంజిత్ కుమార్, సి ఐ పస్రా శంకర్,ఆర్ ఐ అడ్మిన్ సతీష్, ఆర్ ఐ సంతోష్, ఆర్ ఐ వెంకటనారాయణ,ఎస్ ఐ ములుగు వెంకటేశ్వర్, ఎస్ ఐ తాడ్వాయి ఓంకార్, ఎస్ ఐ డి సి ఆర్ బి కమలాకర్, ఎస్ ఐ మధులిక తదితర సిబ్బంది పాల్గొన్నారు.