నిరుపేదలకు కొండంత అండ నేస్తం.
నిరుపేదలకు కొండంత అండ నేస్తం.
నేస్తం చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయం.
బూర్గంపాడు మండల జడ్పిటిసి శ్రీమతి కామిరెడ్డి శ్రీలత
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం : విద్య, వైద్య రంగాల్లో నిరుపేదలకు కొండంత అండగా ఉంటూ ఆపన్న హస్తంగా ఆర్థిక సహాయం చేస్తూ నేస్తం చారిటబుల్ ట్రస్ట్ చేస్తున్న సేవలు అభినందనీయమని బూర్గంపాడు మండల జడ్పిటిసి శ్రీమతి కామిరెడ్డి శ్రీలత అన్నారు.
ఆదివారం మొరంపల్లి బంజర గ్రామంలో నేస్తం వెల్ఫేర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నెల్లెల వెంకన్న కుటుంబ సభ్యులకు 4 లక్షలు 44 వేల రూపాయల విలువగల చెక్కు పంపిణీ కార్యక్రమంలో ముందుగా ట్రస్ట్ చైర్మన్ బత్తుల రామ కొండారెడ్డి మాట్లాడుతూ..మొరంపల్లి బంజర గ్రామానికి చెందిన నేస్తం వెల్ఫేర్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు నెల్లెల వెంకన్న గత మూడు సంవత్సరాల క్రితం తీవ్ర అనారోగ్యంతో మరణించడంతో వారి కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు.
వాళ్ళ కుటుంబానికి అండగా నిలిచేందుకు నేస్తం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సపోర్ట్ వెంకన్న ఫ్యామిలీ పేరుతో ఒక వాట్సప్ గ్రూపును ఏర్పాటు చేసి దాతల సహకారంతో 3,16,000 వేల రూపాయల ఆర్థిక సాయం చేయడంతో వాటిని ట్రస్ట్ ఆధ్వర్యంలో గత మూడు సంవత్సరాల క్రితం వడ్డీకి ఇచ్చి నేటికీ సుమారు 4,44,000 రావడం వలన ప్రస్తుతం ఇంటర్ చదువుతున్న వెంకన్న కుమార్తె హాసిక కు ఉపయోగంగా ఉంటుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కైపు రోశి రెడ్డి, మాజీ సొసైటీ చైర్మన్ పోతిరెడ్డి వెంకటేశ్వర్ల రెడ్డి, ట్రస్ట్ చైర్మన్ బత్తుల రామకొండ రెడ్డి, స్థానిక జడ్పీహెచ్ఎస్ హెచ్ఎం కే ఆదినారాయణ , రిటైర్డ్ హెచ్ఎం కొండ్రు వెంకటేశ్వర్లరావు, మొరంపల్లి బంజర మాజీ సర్పంచ్ భూక్య దివ్యశ్రీ, గ్రామ పెద్దలు మేడిగం లక్ష్మీనారాయణ రెడ్డి, కైపు సుబ్బిరామిరెడ్డి, సారెడ్డి దామోదర్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ చేయూత ట్రస్టు చైర్మన్ కైపు లక్ష్మీనారాయణ రెడ్డి, సొసైటీ డైరెక్టర్ బి. కొండారెడ్డి , ట్రస్ట్ సభ్యులు జింకల రాంగోపాల్ రెడ్డి, ఐ వి రాజేష్, సోము రఘునాథరెడ్డి, కే. రమేష్ రెడ్డి, సంకా సురేష్, బాల నారాయణరెడ్డి, ఆవుల శివ నాగిరెడ్డి గ్రామస్తులు జక్కిరెడ్డి మల్లారెడ్డి,కే .నాగిరెడ్డి, గాదే నర్సిరెడ్డి , మూల లక్ష్మిరెడ్డి,సాయి శ్రీను,యక్కటి శ్రీనివాసరెడ్డి, బిజ్జాం వెంకట రామిరెడ్డి,గంగుల చంద్రశేఖర్ రెడ్డి , మూల రామకృష్ణ రెడ్డి , మేడగం అంకిరెడ్డి,తమ్మినేని శ్రీను,ఆవుల నాగిరెడ్డి మరియు వెంకన్న కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.