విద్యార్థి మరణానికి కారకులై నా వారు సస్పెండ్
విద్యార్థి మరణానికి కారకులై నా వారు సస్పెండ్
గిరిజన సంక్షేమ శాఖ దుమ్మగూడెం మండలం కొత్తపల్లి గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న కుంజా దీపక్ అనే విద్యార్థి మరణానికి కారకులై, విధుల పట్ల అలసత్వం వహించిన పాఠశాల హెచ్ఎం నరసింహారావుకు, షోకజ్ నోటీసు, ఆర్టికల్ ఆఫ్ చార్జెస్,డిప్యూటీ వార్డెన్ హరికృష్ణను సస్పెండ్ చేయడం జరిగిందని భద్రాచలం ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు.
దుమ్ముగూడెం మండలం బండారు గూడెం గ్రామానికి చెందిన, కుంజ దీపక్ కొత్తపల్లి గిరిజన సంక్షేమ శాఖ బాలుర ఆశ్రమ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడని, రెండు రోజులు సెలవులు ఉన్నందున స్నేహితులతో కలిసి తన స్వగ్రామానికి ఆటోలో బయలుదేరుతుండగా ఏటపాక మండలం తునికి చెరువు దగ్గర గుర్తుతెలియని కారు ఢీకొనడంతో ఈ విద్యార్థి అక్కడికక్కడే మరణించడం జరిగిందని ఆయన అన్నారు. విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహించినందుకు గాను హెచ్ఎం నరసింహారావుకు షోకాజ్ నోటీసు, ఆర్టికల్ ఆఫ్ చార్జెస్ ను ,డిప్యూటీ వార్డెన్ హరికృష్ణ ను సస్పెండ్ చేయాలని డిడి ట్రైబల్ వెల్ఫేర్ మణెమ్మను ఆదేశించడం జరిగిందని, శనివారం నాడు వారికి షోకాజ్ నోటీస్, ఆర్టికల్ ఆఫ్ చార్జెస్, సస్పెండ్ ఆర్డర్స్ ను అందించడం జరిగిందని అన్నారు.