ఆర్థిక సహాయం అందచేసిన అచ్చా నవీన్
ఆర్థిక సహాయం అందచేసిన అచ్చా నవీన్.
పినపాక మండలం గోపాలరావుపేట గ్రామ నివాసి పురిటి మహేష్ కొద్దికాలం క్రితం రాత్రి సమయంలో ద్విచక్ర వాహనంపై ఇంటికి వస్తుండగా తోగ్గూడెం గ్రామ శివారులో రోడ్డుపై బర్రెలు అడ్డు రావడంతో వాటిని ఢీకొని తీవ్రంగా గాయాలపాలయ్యాడు.అతనిని భద్రాచలం హాస్పిటల్ కి తరలించారు.మహేష్ కి జరిగిన ప్రమాద వివరాలు తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ సోషల్ మీడియా కో కన్వీనర్ అచ్చా నవీన్ చికిత్స నిమిత్తం 5000 రూపాయల ఆర్థిక సాయం అందించారు.పినపాక మండలంలో ఆపదలో ఉన్నవారికి, అభాగ్యులకు ఎటువంటి కష్టం వచ్చినా అచ్చా నవీన్ స్పందిస్తున్న తీరు పట్ల పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో గోపాలరావుపేట గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు జలగం కనకయ్య, పసల రాము,కొంపెల్లి నాగయ్య,వడ్డె వినోద్, చింతల వెంకన్న, మార్త మనోజ్ తదితరులు పాల్గొన్నారు.