Badradrikothagudem

మోసం చేస్తున్న నా భర్త పై చర్యలు తీసుకోవాలి

మోసం చేస్తున్న నా భర్త పై చర్యలు తీసుకోవాలి

తండ్రి ప్రేమకు నోచుకోలేని బిడ్డల రోదన

కుమార్తె ఇల్లంగి విధుల సంయుక్త 16 కుమారుడు అభిలాష్ 18 ఆవేదన

బీఎస్ఎన్ఎల్ లో సబ్ డివిజనల్ ఆఫీసర్ గా విజయవాడ బెంజ్ సర్కిల్ లో విధులు

భద్రాచలం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో కోర్టునే మోసం చేస్తున్న నా భర్త ఇళ్ళంగి చిట్టిబాబుపై చర్యలు తీసుకోవాలని విలేకరుల సమావేశంలో పలు విషయాలు వెల్లడించిన చిట్టిబాబు భార్యఇళ్ళంగి భవాని. 2002లో కుక్కునూరు మండలం ఉప్పెరు గ్రామంలో చిట్టిబాబుతొ వివాహం జరిగింది . ఉద్యోగరీత వెస్ట్ బెంగాల్ తీసుకువెళ్లడం జరిగింది.2 సంవత్సరాలైనా పిల్లలు పుట్టక పోయేసరికి ఇబ్బందులకు గురిచేసిన చిట్టిబాబు. డాక్టర్లు చిట్టి బాబుదే ప్రాబ్లమ్ అని తెలియజేయడంతో అక్కడి నుండి వెళ్లిపోయిన చిట్టిబాబు. తధానంతరం మందులు వాడడంతో వారికి ఇద్దరు సంతానం పాప బాబు జన్మించడం జరిగింది. భార్య గర్భవతిగా ఉన్నప్పుడు భీమవరం అమ్మాయితొ బెంగళూరులో అక్రమ సంబంధం పెట్టుకోవడం జరిగింది . అప్పటినుండి భార్యాబిడ్డలకు దూరంగా వివాహేతర సంబంధం పెట్టుకొని బయటనే ఉంటున్న చిట్టిబాబు. గత్యంతరం లేని పరిస్థితులలో బిడ్డలను సాదుకోలేక 2013 లో కోర్టుని ఆశ్రయించడంతో ప్రతినెల 20వేల రూపాయలు మెయింటెనెన్స్ ఇస్తూ వస్తున్నాడు . ఏడు సంవత్సరాల క్రితం 30 వేల రూపాయలు ఇవ్వవలసిందిగా కోర్టు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది అప్పటినుండి 20 వేల రూపాయలే ఇస్తూ వస్తున్నాడు 10000 రూపాయలు ఇవ్వకుండా ఉండడంతో దాదాపుగా 10 లక్షల రూపాయలు వీరికి ఇవ్వవలసి ఉన్నది.

ఈనేపథ్యంలో కుమారునికి 18 సంవత్సరములు నిండడంతో అతనికి మెయింటెనెన్స్ ఇవ్వను అంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. గురువారం 10 లక్షల రూపాయలు వారికి ఇచ్చినట్టుగా దొంగ ట్రాన్సాక్షన్ కోర్టుకి సమర్పించిన చిట్టిబాబు. 10 లక్షలు ఇస్తే మా అకౌంట్లో క్రెడిట్ అవుతాయంటూ స్టేట్మెంట్ తీసుకొని విలేకరుల సమావేశంలో చూపిస్తూ వెల్లడించిన భార్య భవాని. చిన్ననాటి నుండి తండ్రి ప్రేమను చూడకుండా పెరిగామని నేడు మా నాన్నని కోర్టు మెట్ల మీదనే చూసుకోవలసిన పరిస్థితి వస్తుందని ఏనాడు కూడా మమ్మల్ని మంచిగా దగ్గర తీసుకోలేదని మాకు ఇవ్వవలసిన మెయింటెనెన్స్ కూడా ఇవ్వకుండా కోర్టునే తప్పుదోవ పట్టించినాడని అతనిపై చర్యలు తీసుకొని మా అమ్మకు మా మాకు తగిన న్యాయం చేయాలని మా నాన్న మా దగ్గరే ఉండే విధంగా కోర్టు అధికారులు సహాయం చేయాలని కోరుతున్న కుమార్తె కుమారుడు. భార్యగా భవాని పేరు ఎస్ ఆర్ లో ఉన్నదని మా పేర్లు దాంట్లో నుంచి తీపించే ప్రయత్నం చేస్తున్నాడని అన్ని దొంగ సర్టిఫికెట్లు తీసుకువచ్చి అధికారులను కోర్టును మోసం చేస్తున్నాడని ఉన్నత ఉద్యోగం చేస్తూ ఉన్నతాధికారులని మోసం చేస్తున్న ఈతగానిపై చట్టపరమైన చర్యలు తీసుకొని మాకు తగిన న్యాయం జరిగేలా చూడాలని బిఎస్ఎన్ఎల్ ఉన్నతాధికారులను కోర్టు వారిని కోరుతున్న బాధితురాలు భవాని కుమార్తె కుమారుడు. ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్ ఎస్ బి ఆర్ ఆఫీస్ లో సబ్ డివిజనల్ ఆఫీసర్ గా విజయవాడ బెంజ్ సర్కిల్ లో విధులు నిర్వర్తిస్తున్నా ఇల్లంగి చిట్టిబాబు. కృష్ణాజిల్లా ఉయ్యూరు లో సిద్దబత్తుల ఆరుద్ర ను భార్య ఉండగా 494 కేసు కోర్టులో నడుస్తుండడంగా 2015 లో వివాహం చేసుకున్న చిట్టిబాబు. ప్రస్తుతం మూడో వివాహం చేసుకున్న వారి కొరకు భార్య బిడ్డలను కాదంటూ కోర్టునే మోసం చేస్తున్న భర్త చిట్టిబాబు పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సిందిగా  భార్య భవాని కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *