త్రాగునీటి సరఫరా లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు.
త్రాగునీటి సరఫరా లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు: జిల్లా కలెక్టర్ ప్రియాంక అల .
పాఠశాలల ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా పాల్వంచ మండలం ప్రశాంత్ నగర్ కాలనీలో ఏర్పాటు చేసిన బడిబాట కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ ప్రజలు కలెక్టర్ తో తమకు తాగునీరు సరఫరా చాలా కాలం నుంచి అందడం లేదని ఫిర్యాదు చేశారు. కలెక్టర్ మున్సిపల్ డి ఈ మురళీకృష్ణ వివరణ కోరగా త్రాగునీరు సరఫరా చేస్తున్నామనివివరణ ఇచ్చారు.కలెక్టర్ దగ్గర్లోని గృహం లోకి ప్రవేశించి అక్కడ కులాయిని తిప్పి మంచినీరు వస్తున్నదా లేదా అని పరిశీలించి అక్కడ ప్రజలను అడగగా త్రాగునీరు సరఫరా జరగటం లేదని తెలిపారు . త్రాగునీరు రావడంలేదని నిర్ధారించి తప్పుడు సమాచారం అందించిన మున్సిపాలిటీ మురళీకృష్ణ కు షోకాజ్ నోటీస్ జారీ చేయవలసిందిగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందనకు ఆదేశాలు జారీ చేశారు. తక్షణమే తాగునీటి సరఫరా పునరుద్దించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం తాగునీటి సరఫరా పై నివేదిక సమర్పించాలని మున్సిపల్ కమిషనర్ ఆదేశించారు.