BadradrikothagudemTelangana

దళితుల తలరాత మార్చబోతున్న అంబేద్కర్ అభయహస్తం పథకం

దళితుల తలరాత మార్చబోతున్న అంబేద్కర్ అభయహస్తం పథకం

దళిత జర్నలిస్టు ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు రత్న కుమార్

అంబేద్కర్ అభయ హస్తం ద్వారా 12 లక్షల రూపాయలు

మొదటి విడతగా దళిత జర్నలిస్టులకు అందజేయాలి

కొత్తగూడెం: తెలంగాణ రాష్ట్రంలో దళిత జర్నలిస్టు ఫోరం సభ్యులందరికీ మొదటి విడతగా అంబేద్కర్ అభయహస్తం ద్వారా 12 లక్షల రూపాయలు అందజేయాలని కోరుతూ పత్రిక ప్రకటన ద్వారా దళిత జర్నలిస్టు ఫోరం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు కాషాపోగు జాన్ ఆదేశాల మేరకు రాష్ట్ర ఉపాధ్యక్షులు అక్కారపు రత్నకుమార్ గురువారం పత్రిక ప్రకటన విడుదల చేశారు  .

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దళితులందరికీ అంబేద్కర్ అభయహస్తం ద్వారా 12 లక్షల రూపాయలు అందజేస్తామని ఆనాడు ఎన్నికలలో వాగ్దానం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేరుస్తూ ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం అన్న మాట ప్రకారమే దళిత బంధు స్థానంలో అంబేద్కర్ అభయ హస్తం ద్వారా 12 లక్షల రూపాయలు దళితులకు అందజేయబోతున్నారన్న సమాచారంతో పత్రికా ప్రకటన విడుదల చేశారు .

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళిత జర్నలిస్టులను గత బిఆర్ఎస్ ప్రభుత్వం దళిత బంధు ఇస్తామని మోసం చేసిందని ఆనాడు దళితులు దళిత జర్నలిస్టులు మోసపోయారని నేడు ఆ పరిస్థితి ఉండదని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకునే వ్యక్తని ఆయన ఒక శక్తి అని అన్నమాట ప్రకారంగా అంబేద్కర్ అభయహస్తం ద్వారా 12 లక్షల రూపాయలు దళితులఅందరికీ ఏర్పాటు చేయబోతున్న సందర్భంగా ముందు మొదటి విడతగా దళిత జర్నలిస్టుల అందరికీ అందే విధంగా చూడాలని వారన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం పై పూర్తి విశ్వాసం దళిత జర్నలిస్టులకు ఉన్నదని కాంగ్రెస్ గెలుపులో దళిత జర్నలిస్టులు కూడా పాత్ర పోషించారని దళితబంధు స్థానంలో అంబేద్కర్ అభయహస్తం అమలు చేయాలని రేవంత్ సర్కార్ యోచిస్తోంది. ఈ పథకం ద్వారా ఒక్కొక్కరికి రూ.12 లక్షలు ఇవ్వనుంది.దీనిపై కసరత్తు మొదలు పెట్టింది. త్వరలోనే కొత్త గైడ్లైన్స్ రానున్నాయి.

కలెక్టర్ల ఆధ్వర్యంలో లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. గత ప్రభుత్వంలో అనర్హులకు, బీఆర్ఎస్ వాళ్లకు దళితబంధు ఇచ్చారనే ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. 10 లక్షల్లో ఎమ్మెల్యేలే సగం తీసుకున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఈసారి పకడ్బంధీగా పథకం అమలుకు ప్రణాళికలు రూపొందిస్తోంది కాంగ్రెస్ రేవంత్ ప్రభుత్వం. వయసు, ఆదాయం, ఆస్తి పరిగణలోకి తీసుకుని లబ్ధిదారుడి ఎంపిక చేయనుంది.ఒక్కరికి రూ.12 లక్షలు ఇవ్వనున్న నేపథ్యంలో దళిత జర్నలిస్టు ఫోరం సభ్యులకు మొదటి విడతగా అందజేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న దళిత జర్నలిస్టు ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు కాశ పొగు జాన్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు రత్నకుమార్ డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *