ఆరిఫా అండ్ రోష్ని వృద్ధాశ్రమానికి నిత్యావసరవస్తులు అందజేత
ఆరిఫా అండ్ రోష్ని వృద్ధాశ్రమానికి నిత్యావసరవస్తులు అందజేత
డోర్నకల్ కు చెందిన బదర్ పాషా కుటుంబ సభ్యుల ఆర్థిక సహకారంతో అశ్వాపురం ఆరిఫా అండ్ రోష్ని వృద్ధాశ్రమానికి పదివేల రూపాయల విలువ గల బియ్యం నిత్యావసరవస్తులు అందజేసారు.
మణుగూరు ఏరియా సింగరేణి సేవా కార్యదర్శి షేక్ షాకిరా బేగం మాట్లాడుతూ.. డోర్నకల్ కి చెందిన తమ బంధువులు ఎండి బదర్ పాషా , వారి కుటుంబ సభ్యులు వృద్ధాశ్రమానికి అందజేయమని తనకు పదివేల రూపాయలు చేతికి ఇచ్చారని అట్టి సొమ్ముతో వృద్ధాశ్రమానికి 150 కిలోల బియ్యం ఇతర నిత్యావసర వస్తువులను అందజేసామన్నారు.
ప్రతి సంవత్సరం వారు సామాజిక సేవకు ఆర్థిక సహకారం అందజేస్తున్నారని.. ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలిపారు.
వర్షాకాలం సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్న నేపథ్యంలో చిన్నపిల్లల మనస్తత్వాన్ని కలిగి ఉండే వృద్ధుల ఆరోగ్యం పట్ల మరింత జాగ్రత్తలు పాటించాలని నిర్వాహకులను ఆమె కోరారు.
నూతనంగా నిర్మించిన వృద్ధాశ్రమం వృద్ధులకు ఎంతో సౌకర్యవంతమైన వసతిగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు.
ఈకార్యక్రమంలో మణుగూరు ఏరియా కార్మిక నాయకులు సామాజిక కార్యకర్త షేక్ అబ్దుల్ రవూఫ్,ఎండి షకీల్,అక్బర్, మోతి సల్మా, నస్రిన్,సింగరేణి సేవా సమితి సభ్యులు యస్ డి నా సర్ పాషా, జమీలా బేగం, షహనాజ్, మెహారాజ్ తదితరులు పాల్గొన్నారు