ప్రశంసా పత్రం అందుకున్న అశ్వరావుపేట సిఐ కరుణాకర్
ప్రశంసా పత్రం అందుకున్న అశ్వరావుపేట సిఐ కరుణాకర్
తెలంగాణ రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయం,హైదరాబాదు నందు రాష్ట్ర డిజిపి డా.జితేందర్ ఐపిఎస్ చేతుల మీదుగా అశ్వరావుపేట సిఐ కరుణాకర్ ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు.చుంచుపల్లి సిఐగా పని చేసే సమయంలో చుంచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని హౌసింగ్ బోర్డ్ కాలనీ వద్ద ఒక మహిళ హత్యగావింపబడిన కేసులో నేరస్థలం వద్ద లభించిన కేవలం ఒక దిష్టిబొమ్మ ఆధారంగా కేసును చేదించి నిందితులకు యావజ్జీవ కారగార శిక్ష పడే విధంగా కృషి చేసినందుకు గాను సీఐ కరుణాకర్ డిజిపి చేతుల మీదుగా ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు.
సీఐ కరుణాకర్ ను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ప్రత్యేకంగా అభినంధన.
అశ్వరావుపేట సిఐ కరుణాకర్ ఒక మహిళ మర్డర్ కేసులో అన్ని కోణాలలో విచారణ చేపట్టి నిందితులకు శిక్ష పడేవిధంగా కృషిచేసి ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు పొందిన సీఐ కరుణాకర్ ను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ప్రత్యేకంగా అభినందించారు.