సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి.
– పోలీస్ శాఖ.
కరకగూడెం,శోధన న్యూస్: సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ లు తెలిపారు. హెడ్ కానిస్టేబుల్ కనకేస్ తమ సిబ్బందితో వీరాపురం క్రాస్ రోడ్ ప్రధాన కూడలి, కరకగూడెం ప్రధాన కూడలి, మోతే, తాటి గూడెం గ్రామాలలో ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ప్రజలు మోసపూరిత ఫోన్ కాల్ నమ్మి మీ దగ్గర ఉన్న ఆధార్ కార్డు, ఓటీపీలు ఎవరికి చెప్పొద్దని అలా చెప్పినట్లయితే మీ ఖాతా నుంచి డబ్బులు మాయమైతాయని మీ ఖాతా నుంచి డబ్బులు పోతే 1930 కాల్ చేస్తే సైబర్ పోలీసులు మీ ఖాతాలపై ప్రత్యేకంగా నిఘా ఉంటుందని అప్రమత్తంగా ఉంటూ సైబర్ మోసాలకు దూరంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, సింహాచలం, రమేష్, రాజు, అశోక్, గ్రామస్తులు, యువకులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.