Police:గంజాయి రహిత జిల్లాగా భద్రాద్రి కొత్తగూడెం.
గంజాయి రహిత జిల్లాగా భద్రాద్రి కొత్తగూడెం.
ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను గంజాయి రహిత జిల్లాగా మార్చేందుకు పోలీస్ శాఖతో పాటు జిల్లా ప్రజలు కూడా సమాచారం అందిస్తూ భాద్యతగా వ్యవహారించాలని ఎస్పీ రోహిత్ రాజు ఒక ప్రకటనను విడుదల చేశారు.జిల్లాలో ఎవరైనా నిషేధిత గంజాయిని రవాణా చేస్తున్నట్లు గానీ,విక్రయిస్తున్నట్లు గానీ,సేవిస్తున్నట్లు గానీ సమాచారం తెలిస్తే వెంటనే పోలీసు వారికి తెపాలన్నారు .నిషేధిత గంజాయిని జిల్లాలో సమూలంగా నిర్మూలించేందుకు సహకరించి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని తెలిపారు.గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిసలై యువత తమ అమూల్యమైన భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని అన్నారు.ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో అలవాటుగా యువకులు గంజాయి సేవించే ప్రదేశాలను గుర్తించడం జరిగిందని,అట్టి ప్రదేశాలలో నిషేధిత గంజాయిని సేవిస్తూ ఎవరైనా కనపడితే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.నిషేధిత గంజాయి రవాణా,విక్రయం,వినియోగాలకు సంబంధించి సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలియజేసారు.జిల్లాలో గంజాయిని నివారించడానికి ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సందర్బంగా తెలిపారు.