ప్రాథమిక ఉన్నత పాఠశాల లో తనిఖీ
ప్రాథమిక ఉన్నత పాఠశాల లో తనిఖీ
పెనుబల్లి మండలం కే మ్ బంజర్ గ్రామం లో ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాల లో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ తనిఖీ నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపాల్ ఉపాధ్యాయులను కలుసుకొని పాఠశాల వివరాలు తెలుసుకున్నారు.అనంతరం పాఠశాల విద్యా , రోజు వారి మధ్యాహ్న భోజన వివరాలు మరియు పాఠశాల ప్రాంగణం పరిసర ప్రాంతాలు పరిశీలించారు. గత ప్రభుత్వ కాలంలో పాఠశాల లో చేసిన స్కూల్ మరమ్మత్తులు పనులు పూర్తి గా చెయ్యకుండా నిర్లక్ష్య వైఖరి తో ప్రభుత్వ ధనాన్ని దోచుకొని పాఠశాల మరమ్మతు నిర్మాణం పూర్తిగా చెయ్యకుండా వదిలివేయడం వల్ల .. స్కూల్ పై నుండి వర్షపు నీరు లోపలికి కారటం , డ్రైనేజి వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటం గమనించి వెంటనే సంబంధిత అధికారులు తో మాట్లాడి తక్షణమే పాఠశాల సందర్శించి వెంటనే పూర్తి స్థాయిలో పనులు చేపట్టి పాఠశాల అభివృద్ధికి కృషి చెయ్యాలన్నారు.