గంజాయి కనిపెట్టడానికి పోలీస్ జాగిలాలతో తనిఖీలు
గంజాయి కనిపెట్టడానికి పోలీస్ జాగిలాలతో తనిఖీలు
జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు నిషేధిత గంజాయి అక్రమ రవాణాను నిరోధించడానికి నార్కోటిక్స్ విభాగంలో ప్రత్యేక శిక్షణ పొందిన రెండు పోలీస్ జాగిలాలతో జిల్లా వ్యాప్తంగా బస్టాండ్లు,రైల్వే స్టేషన్లు మరియు వ్యాపార సముదాయాలలో నిత్యం తనిఖీలు చేపట్టడం జరుగుతుంది.
జిల్లా డాగ్ స్క్వాడ్ లోని పోలీస్ జాగిలాలైన రీనా,గ్రేసీలు నార్కోటిక్స్ విభాగంలో ప్రత్యేక శిక్షణను పొందడం జరిగింది.గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాలను కనిపెట్టడంలో ఈ రెండు జాగిలాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని జిల్లా ఎస్పీ తెలియజేశారు.
యువత భవిష్యత్తును నాశనం చేస్తూ,అక్రమార్జనే ధ్యేయంగా నిషేధిత గంజాయిని రవాణా చేసే వ్యక్తులను పట్టుకోవడానికి వాహన తనిఖీలు చేపట్టడంతో పాటు పోలీస్ జాగిలాల సహాయంతో కూడా వారిని పట్టుకోవడం జరుగుతుందని తెలిపారు.
ఎవరైనా నిషేధిత గంజాయిని రవాణా చేస్తున్నట్లు గానీ,విక్రయిస్తున్నట్లు గానీ సమాచారం తెలిస్తే వెంటనే పోలీసు వారికి సమాచారం అందించాలని తెలిపారు.