ఎస్సై కుమారస్వామి కుటుంబానికి చెక్కు
ఎస్సై కుమారస్వామి కుటుంబానికి చెక్కు
గతేడాది జూన్ నెలలో నర్సంపేట వద్ద రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయిన ఎస్ఐ కుమారస్వామి కుటుంబానికి సోమవారం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు 10,05,000/-(పది లక్షల ఐదు వేల రూపాయలు) నగదును చెక్కు రూపంలో అందజేశారు. డిస్ట్రిక్ట్ క్రైమ్ రికార్డ్ బ్రాంచ్ నందు విధులు నిర్వర్తిస్తూ విధులు ముగించుకొని వెళుతూ కారు ప్రమాదంలో ఎస్సై కుమారస్వామి గతేడాది మరణించారు.భద్రతా ఇన్సూరెన్స్ విభాగం నుండి మంజూరైన ఇట్టి నగదును వారికి అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. నిత్యం ప్రజలకు సేవలు అందిస్తూ విధుల నిర్వర్తించే పోలీసు అధికారులు మరియు సిబ్బంది ప్రయాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యాలయ ఏవో జయరాజు,సూపరింటెండెంట్ శ్రీనివాస్,జిల్లా పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు మరియు తదితరులు పాల్గొన్నారు.