ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ .
ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ .
ఇల్లందు ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ జితేష్ ఆకస్మిత తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన జనరల్ వార్డ్, ఎక్స్రే రూమ్, ప్రయోగశాలను పరిశీలించారు. ప్రతిరోజు ఎన్ని నమూనాలను సేకరించి రిజిస్టర్లలో నమోదు చేస్తున్నారో కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. అక్కడ నుండి ఫార్మసీ కేంద్రాన్ని పరిశీలించి పేషెంట్లకు ఇస్తున్న మందులను పరిశీలించారు. మందుల స్టాక్ వివరాలను రిజిస్టర్ను పరిశీలించారు.
ఎన్ని రకాల వ్యాక్సిన్స్ అందుబాటులో ఉన్నాయో కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. అందుబాటులో ఉన్న వ్యాక్సిన్స్ వివరాలను సేకరించారు. డయాలసిస్ యూనిట్ ను పరిశీలించి రోజుకు ఎంతమంది పేషెంట్లకు డయాలసిస్ చేస్తున్నారో అడిగి తెలుసుకున్నారు.
ప్రసూతి వార్డును పరిశీలించి అక్కడ ప్రసూతి సమయంలో అందించిన వైద్య సేవల గురించి వారిని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. హాస్పిటల్ సిబ్బంది అందరూ మమ్ములను చాలా మంచిగా చూసుకున్నారని వారు కలెక్టర్ కు తెలిపారు. ఆసుపత్రి వైద్యులు సకాలం లో విధులకు హాజరు కావాలని అధికారులకు సూచించారు.
ఆసుపత్రిలోని పరిసర ప్రాంతాలన్నీ పరిశుభ్రంగా ఆదేశించారు. ఆసుపత్రి భవనం లో స్లాబ్ లీకేజీని గుర్తించిన ఆయన కావలసిన మరమ్మత్తులు, ఇతర సదుపాయాలుమరియు చేపట్టాల్సిన అభివృద్ధి పనుల కు సంబంధించి నివేదికలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ఆసుపత్రి ఆవరణంలో ఉసిరి, చింత, వెలగా,కరివేపాకు మరియు మునగ మొక్కలు నాటాలని, వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని సూచించారు.