Badradrikothagudem

పండుగ వాతావరణం లో విద్యార్థులకు ఘన స్వాగతం పలికిన  కలెక్టర్  ప్రియాంక 

పండుగ వాతావరణం లో విద్యార్థులకు ఘన స్వాగతం పలికిన  కలెక్టర్  ప్రియాంక 

జూన్ 12 పాఠశాలల పునః ప్రారంభం సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల పాల్వంచ మండలం ప్రశాంత్ నగర్ ఎంపీపీ ఎస్ పాఠశాల, లక్ష్మీదేవిపల్లి మండలం కొత్తూరు ఎంపీపీ పాఠశాల, గొల్లగూడెం జిపిఎస్ పాఠశాల  చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీలోని ఎంపీపీ ఎస్ పాఠశాలలో జరుగుతున్న బడిబాట కార్యక్రమంలో పాల్గొన్నారు.

విద్యార్థిని, విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు , ఏకరూప దుస్తులు పంపిణీ

 కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ విద్యార్థిని, విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు , ఏకరూప దుస్తులు పంపిణీ చేపట్టారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 12 అంటేనే పాఠశాలలు ప్రారంభం మనందరికీ తెలుసు అని, సుమారు 50 రోజుల సెలవులు అనంతరం తిరిగి పాఠశాలలకు విద్యార్థులు వచ్చే రోజు చాలా ముఖ్యమైన ముఖ్యమైనదని ఆమె తెలిపారు. పండుగ వాతావరణం లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించటం చాలా సంతోషకరమని ఆమె తెలిపారు. బడిబాట కార్యక్రమం ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నప్పటికీ ఈ సంవత్సరం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ప్రత్యేక శ్రద్ధతో ఎన్నికల నిబంధనలు అమలులో ఉన్నప్పటికీ, ఎన్నికల సంఘం కల్పించిన ప్రత్యేక వెసులుబాటుతో మూడు నెలలు ఎంతో కష్టపడి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా పాఠశాలలన్నిటికీ మరమ్మత్తులు చేపట్టామని తెలిపారు. గత కాలంలో జూన్ నెలాఖరు నాటికి పాఠ్యపుస్తకాలు పంపిణీ జరిగేదని కానీ ప్రస్తుతం ముఖ్యమంత్రి గారి చొరవతో విద్యా సంవత్సరం మొదటి రోజే విద్యార్థులకు ఏక రూప దుస్తులు, పాఠ్యపుస్తకాలు పంపిణీ జరిగాయని తెలిపారు.

విద్యా రంగంపై ప్రత్యేక దృష్టి

ఖచ్చితమైన ప్రణాళిక ద్వారా మాత్రమే పాఠశాలలో మొదటి రోజున ఏకరూప దుస్తులు, పాఠ్యపుస్తకాలు మరియు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ పనులు విజయవంతం చేయగలిగామని కలెక్టర్ తెలిపారు.జిల్లాలో 63 వేల మంది విద్యార్థులు విద్యార్థులకు కేవలం 20 రోజుల్లోనే తయారీ ప్రక్రియ పూర్తి చేసామని, దీనికోసం అధికారులు రాత్రింబవళ్లు కష్టించారని తెలిపారు. జిల్లాలోని 858 పాఠశాలలకు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా పనులు చేపట్టామని. మరమ్మత్తుల కోసం 26 కోట్ల నిధులు మంజూరు చేశామని తెలిపారు. ప్రతి పాఠశాల గదులలో రెండు ఫ్యాన్లు రెండు లైట్లు, తాగునీరు, మరియు విద్యార్థిని, విద్యార్థులకు మరుగుదొడ్లు విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేశామని తెలిపారు. కేవలం నెలన్నర వ్యవధిలో 70% పాఠశాలలు పనులు పూర్తి చేశామని, రానున్న 15 రోజుల్లో జిల్లాలోని అన్ని పాఠశాలల్లో పనులు పూర్తి అవుతాయని తెలిపారు. ప్రైవేటు విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ విద్యా పాఠశాలలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. విద్యార్థులు తల్లిదండ్రులు కల్పించే వినియోగించుకోవాలని కోరారు. ప్రభుత్వం విద్యా రంగంపై ప్రత్యేక దృష్టి సాధించిందని, అన్ని సదుపాయాలు కల్పించిందని ఆమె తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు ఎంతో అనుభవం కలిగిన వారని ప్రతి ఒక్క విద్యార్థి పైన ప్రత్యేక శ్రద్ధ తీసుకుని విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేస్తారని కలెక్టర్ తెలిపారు. ప్రైవేటు విద్యాసంస్థల కంటే ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కువ సౌకర్యాలు కల్పించడం జరిగిందని తెలిపారు. రాబోవు రోజుల్లో విద్యారంగంలో ఇంకా ఎక్కువ సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని, బడి ఈడు పిల్లలందరూ పాఠశాలల్లో మరే ఇతర పనులకు వెళ్లరాదని కలెక్టర్ కోరారు. విద్యార్థుల చదువు తల్లిదండ్రుల కు భారం కాకుండా ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని ప్రైవేటు విద్యాసంస్థలకు వెళ్లి ఫీజులు భారం ఆమె తెలిపారు. ప్రైవేటు విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంలో బోధనలు ప్రభుత్వం చేపట్టిందని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో భాగంగా కొత్తగూడెం మండలం గొల్లగూడెం జిపిఎస్ పాఠశాల నందు బడిబాట కార్యక్రమం గోడ పత్రికను కలెక్టర్ ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ కంచికచర్ల చంద్రశేఖర్, మున్సిపల్ చైర్మన్ కాపు సీతామాలక్ష్మి, డి ఆర్ డి ఓ విద్యా చందన, కొత్తగూడెం ఆర్డీవో మధు, జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర చారి,మున్సిపల్ కమిషనర్ శేషాంజన స్వామి, తాసిల్దార్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఎంపీపీలు మరియు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *