Badradrikothagudem

సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే..

సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే..

ఈనెల 6 నుండి మొదలయ్యే సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో భాగంగా  పాల్వంచ మండలం పునుకుల గ్రామంలో నిర్వహిస్తున్న కుటుంబాలకు గుర్తింపు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ పాల్గొన్నారు. ఎన్యుమరేటర్లకు తగు సూచనలు చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ ప్రతి ఒక్క ఎన్యూమరేటర్ వారికీ కేటాయించిన బ్లాక్ ప్రకారముగా ప్రతి ఇంటిని ప్రతి కుటుంబము ను గుర్తించాలని, ఈరోజు నుండి 3 వ తేదీ వరకు ఇట్టి ఇంటి గుర్తింపును పూర్తి చేసి ప్రతి కుటుంబము న కు హౌస్ లిస్టింగ్ స్టికర్ ను అతికించాలన్నారు.

ఎన్యూమరేటర్లు తు.చ తప్పక ప్రతి ఇంటికి వెళ్లి సమగ్ర సమాచారాన్ని నింపాల్సి ఉంటుందని అన్నారు. ప్రతి ఇంటి నుండి స్పష్టత కల్గిన ఖచ్చితమైన సమాచారాన్ని నమోదు చేయాలన్నారు. ఈ సర్వే ఉద్దేశ్యం రాష్ట్రము లోని షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులు మరియు ఇతర బలహీన వర్గాల అభ్యున్నతి కొరకై వివిధ సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి మరియు రాజకీయ అవకాశములు మెరుగు పరచడానికి తగిన ప్రణాళికలు తయారు చేయడం మరియు వాటిని అమలు చేయడం ప్రభుత్వ లక్ష్యమని ప్రజలకు తెలియ చేసి అందరు ఇంటింటి కుటుంబ సర్వే లో పాల్గొనేలా చేయాలన్నారు.

ఎన్యుమారెటర్లు సర్వే చేయుటకు తీసుకోవాలసిన జాగ్రత్తలు,సూచనలు తెలిపారు. ఈ కార్యక్రమం లో పాల్వంచ మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీ కె విజయభాస్కర్ రెడ్డి, మండల పంచాయతీ అధికారి శ్రీ బి నారాయణ, పంచాయతీ కార్యదర్శి బి బాబూరావు, అంగన్వాడీ టీచర్లు,ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *