తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ వర్ధంతి
తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ వర్ధంతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ కార్యాలయంలో తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా అడిషనల్ ఎస్పీ పరితోష్ పంకజ్, పోలీస్ అధికారులు మరియు జిల్లా పోలీస్ కార్యాలయ సిబ్బంది ఆమె చిత్రపటానికి నివాళులర్పించారు.ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ తెలంగాణ వీరవనిత చిట్యాల ఐలమ్మ సెప్టెంబరు 26,1895లో జన్మించి చాకలి ఐలమ్మగా గుర్తింపు పొందిన తెలంగాణ ఉద్యమకారిణి అని తెలిపారు.
వెనుకబడిన కులంలో జన్మించి కులవృత్తే జీవనాధారంగా జీవిస్తున్న చాకలి ఐలమ్మ గారికి దళారులతో ఎదురైన అవమానాలకు ఎదురొడ్డి వారిపై నిర్విరామ పోరాటం చేసి దొరల పాలనకు చరమగీతం పాడిన వీరమహిళ అని అన్నారు.ఆమె పోరాటంతో 10 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచారని తెలిపారు.10.09.1985లో మరణించిన ఐలమ్మ రాబోయే తరాలకు స్ఫూర్తి గా నిలిచారని తెలిపారు.ఆమె పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ సమ సమాజ స్థాపన కోసం బాధ్యతగా తమ వంతు కృషి చేయాలని కోరారు.