BadradrikothagudemManuguru

వృద్ధులకు పండ్లు పంపిణీ

వృద్ధులకు పండ్లు పంపిణీ

సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియా సెక్యూరిటీ విభాగం ఉద్యోగి బండారి జయరాజు (జమేదార్) తన తండ్రి వీరాస్వామి జ్ఞాపకార్థం ఆదివారం సాయంత్రం అశ్వాపురం ఆరిఫా అండ్ రోష్ని వృద్ధాశ్రమంలో వృద్ధులకు 50 కిలోల బియ్యాన్ని నిత్యవసర వస్తువులను వితరణగా అందజేసి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు.

వృద్ధాశ్రమం నిర్వాహకులను ఆయన అభినందించారు.

ఈ సందర్భంగా సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్( ఐ ఎన్ టి యు సి) మణుగూరు ఏరియా ప్రధాన కార్యదర్శి, సామాజిక కార్యకర్త సిల్వేరు గట్టయ్య యాదవ్ మాట్లాడుతూ తమ ఇంట్లో ఏ శుభ కార్యమైనా ఏదో ఒక సామాజిక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వృద్ధులకు అనాధ విద్యార్థి విద్యార్థులకు ఎంతగానో ఆదుకుంటున్న జయరాజు ని వారి కుటుంబ సభ్యులను ఆయన ఎంతగానో ప్రశంసించారు. 30 మందికి పైగా వృద్ధులను చేరదీసి వారి బాగోగులు చూసుకుంటున్న వృద్ధాశ్రమం నిర్వాహకులను ఆయన అభినందించారు.ఈ కార్యక్రమంలో జయరాజు, వారి కుటుంబ సభ్యులు జ్యోతి, తనూజ ,మైతిలి, సింగరేణి సేవాసమితి యస్ డి నాసర్ పాషా, భరోసా వెల్ఫేర్ సొసైటీ సభ్యులు ఎండి అమీనుద్దీన్, సిహెచ్ వెంకటేశ్వర్లరావు, ఈ అశోక్ కుమార్ , వృద్ధాశ్రమం నిర్వాహకులు ఎస్.కె మె హారాజ్ భద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *