Collector : ఫ్లడ్ కంట్రోల్ రూమ్ ను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ .
ఫ్లడ్ కంట్రోల్ రూమ్ ను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ .
భద్రాద్రి కొత్తగూడెం ఐ డి ఓ సి కార్యాలయంలో ఏర్పాటు చేసిన గోదావరి వరదల కంట్రోల్ రూమ్ జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన కంట్రోల్ రూమ్ లో నిర్వహిస్తున్న సేవలు గురించి అక్కడున్న సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంట్రోల్ రూమ్ ద్వారా వరద ప్రవాహం కి సంబంధించిన పూర్తి వివరాలు ప్రజలకు తెలియజేస్తూ వారిని అప్రమత్తం చేయాలని సూచించారు. కంట్రోల్ రూమ్ కు వచ్చిన ప్రతి ఒక్క ఫిర్యాదు పై తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.