BadradrikothagudemManuguru

పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ 

పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ 

మణుగూరు, శోధన న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్  మణుగూరు పోలీస్ స్టేషన్ ను అకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ ను సందర్శనకు విచ్చేసిన  ఎస్పీకి మణుగూరు డిఎస్పి రవీందర్ రెడ్డి పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. ఎస్పీ రోహిత్ రాజ్ కు మణుగూరు పోలీస్ స్టేషన్ లో  సిబ్బంది  గౌరవ వందనం చేశారు. అనంతరం ఎస్పీ పోలీస్ స్టేషన్ లో ఉన్న లాకప్ రూమ్, కోర్ట్ రూమ్ లను పరిశీలించడం తో పాటు రికార్డులను తనిఖీ చేశారు. స్టేషన్  పరిసరాలను పరిశీలించారు.  పెండింగ్ లో ఉన్న కేసులను త్వరితగతిన  పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. నూతనంగా నిర్మిస్తున్న పోలీస్ స్టేషన్ ని పరిశీలించి సంబందించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.  ఈ కార్యక్రమంలో డిఎస్పి రవీందర్ రెడ్డి సిఐ సతీష్ కుమార్, ఎస్సై మేడ ప్రసాద్, రంజిత్,  ఏఎస్సైలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *