అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు
అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు : ఎస్పీ రోహిత్ రాజు
గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రహదారులన్ని జలమయమయ్యాయి.వాహనదారులు ప్రయాణాలు చేసేటప్పుడు రోడ్లపై ఉన్న గుంతలు నీటితో నిండి ఉండటం వలన రోడ్డు ప్రమాదాలకు గురి అయ్యా అవకాశం ఉందని,అత్యవసరమయితే తప్ప బయటకి రావద్దని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు.రాబోయే రెండు రోజుల్లో కూడా భారీ వర్షాలు ఉన్నట్లు ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.భారీ వర్షాల కారణంగా జిల్లాలోని వాగులు వంకలు,చెరువులు,నదులు పొంగి ప్రవహిస్తున్నందున లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.జిల్లాలోని ముంపు ప్రాంతాలను ముందుగానే గుర్తించి ఇతర శాఖలతో సమన్వయం పాటిస్తూ పోలీస్ యంత్రాంగం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటుందన్నారు.ఉదృతంగా ప్రవహిస్తున్న నదులను పొంగిపొర్లుతున్న చెరువులను,వాగులను చూడటానికి బయటికి వచ్చి ప్రమాదాల బారిన పడవద్దని విజ్ఞప్తి చేశారు.ఆపదలో ఉన్నవారు డయల్ 100నకు ఫోన్ చేసి పోలీసు వారి సేవలను వినియోగించుకోవాలని తెలియజేసారు.