Electric poles: విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు పునరుద్దించాలి
విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు పునరుద్దించాలి.
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విద్యుత్ శాఖ వారితో మాట్లాడుతూ అన్ని గ్రామాలలో విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ సరఫరా పునరుద్దించాలని ఆదేశించారు.వరదల అనంతరం గ్రామాలలో ప్రజలు విష జ్వరాల బారిన పడతారని, ప్రతి గ్రామంలో ఏఎన్ఎంలు, అంగన్వాడి ఆశాలతో ఇంటింటికి సర్వే చేయించి ప్రజల ఆరోగ్యాలు తెలుసుకోవాలని ప్రజల ఆరోగ్యం బాధ్యత ప్రభుత్వ వైద్యుల దేనని, అదనంగా సిబ్బంది,వాహనం అవసరమైతే జిల్లా కలెక్టర్ కి ప్రతిపాదన పంపాలని ప్రజల ఆరోగ్యం పట్ల ఎటువంటిది నిర్లక్ష్యం వహించరాదని హెచ్చరించారు.
వైద్య , పంచాయతీ శాఖ సమన్వయంతో అంటువ్యాధులు ప్రబలకుండా తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
పంచాయతీరాజ్ రోడ్లు భవనాల ఇంజనీర్లతో మాట్లాడుతూ వరద వల్ల తెగిపోయిన రోడ్లు, ఓవర్ బ్రిడ్జిలు వద్ద జరిగిన డ్యామేజీ కి ముందుగా గ్రావెల్ పోసి ప్రజారావాణా కి ఇబ్బంది కలగకుండ చూడాలన్నారు. వర్షాలు తగ్గాక శాశ్వత ప్రాతిపదికన రోడ్డు రిపేరు చేయొచ్చు అన్నారు.
జిల్లాలోని అన్ని పాఠశాలలో శిథిలావస్థ లో వున్న భవనాలు గుర్తించి వెంటనే అట్టి భవనాలను కూల్చివేయాలన్నారు. ప్రత్యామ్నాయంగా వాటి స్థానంలో తాత్కాలికంగా షెడ్లు లేదా వేరే భవనంలోనికి పాఠశాలలు మార్చాలని విద్యార్థులకు రక్షణ కల్పించాలన్నారు.
వ్యవసాయ మరియు ఉద్యానవన శాఖ అధికారులతో మంత్రి మాట్లాడుతూ వరద వల్ల అశ్వరావుపేట మండలంలోని వరి పొలాలు ఎంత మేరకు నష్టపోయాయో సర్వే సిద్ధం చేయాలన్నారు, పత్తి పొలాలకు, ఆయిల్ ఫామ్ తోటలలో ఎంతవరకు ఎంత మేరకు ఇసుక మేటలు పేరుకు పోయాయో తనిఖీ చేయాలన్నారు. నష్టపోయిన రైతులు తదుపరి ఏ పంట వేయాలి అనుకున్నారో తెలుసుకుని వారికి తగిన విత్తనాలు అందజేయాలన్నారు.