Justice: బాధితులకు న్యాయం చేకూరుతుందనే భరోసా కల్పించాలి
బాధితులకు న్యాయం చేకూరుతుందనే భరోసా కల్పించాలి.
పాల్వంచ రూరల్ పోలీస్ స్టేషన్ ను సందర్శించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
పాల్వంచ రూరల్ పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సందర్శించడం జరిగింది.ముందుగా టిఎస్ఎస్పి సిబ్బంది నుండి గౌరవ వందనం స్వీకరించారు.అనంతరం పోలీస్ స్టేషన్ రికార్డులను పరిశీలించి,పలు కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లోని అధికారులు,సిబ్బందికి పలు సూచనలు చేశారు.డయల్ 100 ఫోన్ రాగానే స్పందించి ఘటనా స్థలానికి చేరుకొని బాధితులకు న్యాయం చేకూర్చాలని సూచించారు.పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రజలకు అవగాహన కల్పిస్తూ నివారణా చర్యలు చేపట్టాలని తెలిపారు.సైబర్ నేరాల బారిన పడకుండా ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేయాలని తెలిపారు.అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.మావోయిస్టుల కదలికలపై కూడా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసుకొని అప్రమత్తంగా ఉండాలని సూచించారు.అనంతరం అధికారులు మరియు సిబ్బంది సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.